వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులకు దరఖాస్తులు

వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను  నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో  మూడు పోస్టు లు  అవసరమున్నట్లు జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిని వారధి సొసైటీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓసీ జనరల్‌, ఓసీ, ఎస్సీ మహిళకు పోస్టులు రిజర్వు అయ్యాయి. ఈ నెల 27 నుంచి 29 తేదీ దాకా దరఖాస్తుల స్వీకరణ  కొనసాగుతుండగా, బుధవారం 60 మంది దరఖాస్తు చేసుకున్నారు.