ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్జోషి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా సి. నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
గతంలో నారాయణ రెడ్డి 2011లో గద్వాల ఆర్డీవోగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీవోగా, అనంతరం సూర్యాపేట్ ఆర్డీవోగా పనిచేసిన ఆయన, జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ములుగు కలెక్టర్గా చేస్తూ నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.