షాద్‌నగర్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పట్టణంలోని ఫరూఖ్నరగ్లో ఈ రోజు ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ కేసులన్నీ వారం రోజుల వ్యవధిలోనే నమోదవడం విశేషం. ఆమె తన భర్తతో కలిసి మే 12న హైదరాబాద్‌లోని జియాగూడలో ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో వారిద్దని మే 23న క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఫరూక్‌నగర్‌లోని సుమారు వంద ఇండ్లను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించామని, అక్కడి రాకపోకలను పూర్తిగా నియంత్రించామని డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. చందూనాయక్ తెలిపారు.
