ఏపీలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 11,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 33 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,874కు చేరింది.  కొత్తగా నమోదైన కేసుల్లో 6 కేసులకు కోయంబేడు లింకున్నది.   24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 79 మంది డిశ్చార్జ్‌ కాగా ఒకరు మృతి చెందారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 2,037 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 777 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బారిన పడి 60 మంది చనిపోయారు.