
అవినీతి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదాబాబును పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్ టాక్స్ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై నల్లగొండ జిల్లా ఎస్పీ ఎవీ.రంగనాథ్ పూర్తి స్థాయిలో 15 రోజుల పాటు విచారణ జరిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సబ్ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న డీ.సైదాబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ అనంతరం అతడిని సస్పెండ్ చేస్తూ హైద్రాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శివశంకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.