ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింటికి కోయంబేడుతో లింకులున్నాయి. గడచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలను సేకరించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. ఇప్పటి వరకు 2,092 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 792 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం వరకు కరోనా వల్ల 60 మంది మృతి చెందారు.
