తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు.
లాక్‌డౌన్ 5.0పై తాజాగా కేంద్ర జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో సీఎం కూలంకషంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. అలాగే కర్వూ వేళల్లో కూడా సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు కర్పూ రాత్రి 7 నుంచి తెల్లవారు 7 వరకు కొనసాగుతోంది. అయితే కేంద్రం తాజాగా కర్ఫూ రాత్రి 9నుంచి ఉదయం 5గంటల వరకు కుదించింది. ఇక 8వ తేదీ నుంచి లాక్‌డౌన్‌లోనూ పలు సండలింపులు ఇచ్చింది. ప్రధానంగా అన్ని వర్గాలకు చెందిన ప్రార్ధనా మందిరాలను ఆ రోజు నుంచి తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలకు సంబంధించిన సంస్థలు, షాపింగ్ మాల్స్‌ను కూడా తెరుచుకునేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.