భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 5,164కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరినట్లు పేర్కొంది. ఈ వైరస్ నుంచి 86,984 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 65,168 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,197 మంది చనిపోయారు. తమిళనాడులో 21,184, ఢిల్లీలో 18,549, గుజరాత్లో 16,356, రాజస్థాన్‌లో 8,617, మధ్యప్రదేశ్‌లో 7,891, యూపీలో 7,701, బెంగాల్లో 5,130, బీహార్‌లో 3,565, ఏపీలో 3,461, కర్ణాటకలో 2,922, తెలంగాణలో 2,499, జమ్మూకశ్మీర్‌లో 2,341, పంజాబ్‌లో 2,233, హర్యానాలో 1,923, ఒడిశాలో 1,819, అసోంలో 1,217, కేరళలో 1,209, ఉత్తరాఖండ్‌లో 749, జార్ఖండ్‌లో 563, ఛత్తీస్‌గఢ్‌లో 447, హిమాచల్‌ప్రదేశ్‌లో 313, ఛండీఘర్‌లో 289, త్రిపురలో 271, లడఖ్‌లో 77, గోవాలో 70, మణిపూర్‌లో 60, పుదుచ్చేరిలో 57, నాగాలాండ్‌లో 36, అండమాన్ నికోబార్ దీవుల్లో 33, మేఘాలయలో 27, అరుణాచల్‌ప్రదేశ్‌లో 3, మిజోరాం, సిక్కింలో ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.