దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ ప్రభావంతో 230 మంది మృతిచెందారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,535కి పెరిగింది. ఇందులో 93,322 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 91,819 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5394కు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 7వ స్థానానికి చేరింది.
