రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ ‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సీ జగన్‌ కలవనున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. దేశరాజధానిలో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత సీఎం జగన్‌ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.