ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా పాజిటివ్‌..

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన ఓ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా వైర‌స్ పాజిట‌వ్ వ‌చ్చింది.  ముంబై నుంచి రెండు రోజుల క్రితం ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌నకు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో.. కోవిడ్‌19 పాజిటివ్ తేలిన‌ట్లు స‌మాచారం.  ముంబైలోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ రీస‌ర్చ్ ఇన్ రీప్రొడెక్టివ్ హెల్త్ లో ఆ సైంటిస్టు ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం.  ఢిల్లీలోని ఐసీఎంఆర్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు.  దీంతో ఢిల్లీ కార్యాల‌యాన్ని శానిటైజ్ చేస్తున్నారు.  ఆయ‌న ఎవ‌రెవ‌ర్ని కాంటాక్ట్ అయ్యార‌న్న దానిపై కూడా ట్రేసింగ్ జ‌రుగుతున్న‌ట్లు ఐసీఎంఆర్ అధికారులు వెల్ల‌డించారు