కరోనా మహమ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. తాజాగా నగరంలోని బీజీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు సమాచారం. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తున్నది. కరోనా బాధితులు నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
