జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు – కేంద్ర ఎన్నికల సంఘం

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి..అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా..గుజరాత్‌ లో 4 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలు, రాజస్థాన్‌లో 3 స్థానాలు, జార్ఖండ్‌ లో 2 స్థానాలు, మణిపూర్‌, మేఘాలయ రాష్ర్టాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం కాగా..మిగిలిన 18 స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు జరుగునున్నాయి. మార్చిలోనే రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కోవిడ్‌-19 ప్రభావంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.