అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు. 

తెలంగాణ భవన్‌లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.