తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2014, జూన్2వ తేదీన 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ముందడుగు వేస్తుందన్నారు. ఈ ఆరు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ 19ను పరిస్థితిని ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు. సానుకూల స్ఫూర్తితో, తెలంగాణ ‘సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్ర’ మని నిరూపిస్తూ తాము కచ్చితంగా విజయవంతంగా బయటకు వస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
