ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరింది. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 3,82,227 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,09,732 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అమెరికాలో అత్యధికంగా 1,08,059 మంది కరోనాతో చనిపోయారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 18,81,205కు చేరింది. బ్రెజిల్లో 31,309 మంది, రష్యాలో 5,037, స్పెయిన్‌లో 27,127, యూకేలో 39,369, ఇటలీలో 33,530, ఇండియాలో 5,829, ఫ్రాన్స్‌లో 28,940, జర్మనీలో 8,674, పెరూలో 4,634, టర్కీలో 4,585, ఇరాన్లో 7,942, మెక్సికోలో 10,637, కెనడాలో 7,395, బెల్జియంలో 9,505, నెదర్లాండ్స్‌లో 5,967 మంది కరోనాతో మృతి చెందారు.
