★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3
★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..?
★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు పీసీబీ అధికారులు ఏం చేస్తున్నారు..?
మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలేకోలేనంతగా వాతావరణం కలుషితమై.. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.
అంతేకాక మనిషి తన వేగవంతమైన జీవితంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతుంది. వాతావరణంలో విషవాయులు పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టి కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
కానీ మన తెలుగు రాష్ట్రాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు మాత్రం అవేవీ పెద్దగా పట్టడం లేదు. అంతేకాదు సంవత్సరానికి ఒకరోజు చేసే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కూడా ప్రజల్లో సరైన అవగాహన కల్పిద్దాం అనే చిత్తశుద్ది కూడా పీసీబీ అధికారులకు లేకుండా పోయింది. జూన్ – 5 అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజు ఏదో మొక్కబడిగా ఒక ర్యాలీ తీసి, కొంత మందిని ఒక చోట కూర్చోబెట్టి నలుగురితో పర్యావరణం గురించి మాట్లాడించి చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాకుండా ఆ రోజు ఇచ్చే ఉపన్యాసాల్లో మాత్రం కాలుష్యాన్ని మొత్తంగా నివారించినంత బిల్డప్ ఇస్తారు. మాటలు కోటలు దాటుతాయి. పొల్యూషన్ మాత్రం గడప దాటదు. దీని వల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సాధించేది ఏంటీ..? ఇది ఎప్పటికీ.. ఎవరికీ అర్థంకానీ ప్రశ్నగానే మిగిలిపోతోంది. సంవత్సరాలు గడుస్తున్న పొల్యూషన్ విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. లోపం ఎవరిలో ఉంది..? అధికారులలోనా..? ప్రజలలోనా..?
అసలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఉద్దేశం ఏంటి..? దానికి పోల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎంత వరకు న్యాయం చేస్తున్నారు. అసలు ప్రజలకు పొల్యూషన్ కంట్రోల్ చేయడం మీద అవగాహన కలిగేలా చేస్తున్నారా..? నిజంగా ప్రజలకు పోల్యూషన్ కంట్రోల్ మీద అవగాహన ఉందా..?
ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు. పీసీబీ అధీనంలో మూడు బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల ద్వారా ప్రజల్లో పొల్యూషన్ పట్ల ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు. అసలు అవగాహన కల్పిస్తున్నారా..? లేదా..? ఇస్తే ఎవరికి అవగాహన కల్పిస్తున్నారు..? దాని వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంది.
ఇకపోతే మౌత్ పబ్లిసిటీ ఎలా ఇస్తున్నారు..? పీబీసీ ఆధ్వర్యంలో పర్యావరణం పట్ల ఏమైన సెమినార్స్ నిర్వహిస్తున్నారా..? నిర్వహిస్తే జిల్లాల వారిగా నిర్వహిస్తున్నారా..? లేక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారా..? ఒకవేళ అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని సెమినార్స్ నిర్వహించారు..? అసలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది..? నాకు తెలిసి గత 15 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చిత్తశుద్దితో చేసినట్లు అనిపించలేదు. ఇక ఈసారి ఎలా చేస్తారో చూద్దాం.. అసలే ‘‘కరోనా టైం’’ చేస్తారో.. చేయారో కూడా తెల్వదు.. ఒకవేళ చేస్తే వారికి తెలిసిన.. అనుకూలమైన ఓ నలుగురిని పిలిచి తూ తూ మాత్రంగా చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయిపోయింది, అనిపిస్తారేమో.. చూద్దాం.. ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎలా చేస్తారో..
ఏది ఏమైనా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. అదే జరగకపోతే భవిష్యత్ తరాలకు జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలను రక్షించుకుందాం..
This year the theme of World Environment Day 2020 is “Celebrate Biodiversity”. “With 1 million species facing extinction, there has never been a more important time to focus on biodiversity.” Colombia is one of the largest “Megadiverse” nations in the world to hold 10% of the planet’s biodiversity.