భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8,909 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2.07 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 5,815 మంది కరోనాతో చనిపోయారు. 1,00,303 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891, జమ్మూకశ్మీర్‌లో 2,718, హర్యానాలో 2,652, పంజాబ్‌లో 2,342, ఒడిశాలో 2,245, అసోంలో 1,562, కేరళలో 1,413, ఉత్తరాఖండ్‌లో 1,043, జార్ఖండ్‌లో 722, ఛత్తీస్‌గఢ్‌లో 564, త్రిపురలో 471, హిమాచల్‌ప్రదేశ్‌లో 345, ఛండీఘర్‌లో 301, మణిపూర్‌లో 89, లఢక్‌లో 81, గోవాలో 79, నాగాలాండ్‌లో 58, అండమాన్ నికోబార్ దీవుల్లో 33, మేఘలాయలో 30, అరుణాచల్‌ప్రదేశ్‌లో 28, మిజోరాంలో 13, సిక్కింలో ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది.