ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 1033. వ్యాధి నుంచి కోలుకొని 2273 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 కారణంగా తాజాగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. గుంటూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు అదేవిధంగా కర్నూల్లో మరొక వ్యక్తి కోవిడ్ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మరణాలు 71కు చేరుకున్నాయి.
