గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.
మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ
ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టిన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ధన్యావాదాలు తెలుపుతున్నాను. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అన్నారు. అలాగే మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటాలని తన తోటి సహచరులకు గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు