ఏపీలో మరో 138 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో మరో 138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాల తాజా బులెటిన్‌ను  ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది.

రాష్ర్టంలో 50 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 84 మందికి, విదేశాల నుంచి వచ్చిన నల్గురికి కరోనా నిర్దారణ అయినట్లు తెలిపారు. ఏపీలో మొతం కరోనా పాజిటి‌వ్‌  కేసుల సంఖ్య 4250 కాగా 2294 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా నేడు కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మరణించినట్లు వెల్లడించారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య 73కు చేరుకుంది.