ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..

జూన్‌ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సందేశాన్నిస్తుంది.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరి బీచ్‌లో శాండ్‌ ఆర్ట్‌ ద్వారా మెసేజ్‌ ఇచ్చాడు. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020. ప్రకృతితో కలిసి జీవించాలి. దినోత్సవం సందర్భంగా ఓడిశాలోని పూరి బీచ్‌లో ఒక మెసేజ్‌తో శాండ్‌ ఆర్ట్ వేశాను‌. పర్యావరణాన్ని పచ్చదనంగా మార్చాలి’ అనే క్యాప్షన్‌ జోడించాడు పట్నాయక్‌. గురువారం నాడు కేరళలో జరిగిన ఏనుగు మరణాన్ని విశ్లేషిస్తూ తన ఆర్ట్‌తో సంతాపం తెలిపాడు. ఇలా తన ప్రతిభతో సందర్బానికి తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు పట్నాయక్‌.