తహసీల్దార్‌ ఇంటి నుంచి రూ.30లక్షలు స్వాధీనం

భూ హద్దులను చూపించడానికి బాధితుడు నుంచి  లంచం తీసుకొంటు  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ షేక్‌పేట ఆర్‌ఐని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత ఇంటిపై కూడా శనివారం దాడులు నిర్వహించారు.

లోయర్‌ ట్యాంక్‌బండ్‌ గాంధీనగర్‌లో ఉంటున్న ఆమె నివాసం నుంచి 30లక్షల నగదు, అరకిలో బంగారం,పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ ఇంటిలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.