జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఓ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను అధికారులు ఇళ్లకు పంపించి, శానిటైజేషన్‌ చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో సుమారు 15 వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.