ఎల్జీపాలిమార్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన వివరాల నివేదికను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. సోమవారం నాటికి విచారణ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
విశాఖపట్నంలోని ఎల్జీపాలిమార్ ప్రాంతంలో మూడు రోజుల పాటు హైపవర్ కమిటీ సభ్యులు ఎల్జీ పాలిమార్ పరిసర ప్రాంతాల ప్రజలు, బాధితులు, ప్రతిపక్ష, ప్రజాసంఘాల పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. చివరి రోజు జీవీఎంసీ ఫైర్ సిబ్బంది, జర్నలిస్టు ప్రతినిధులు కలిసి కమిటీకి పలు సూచనలు చేశారు.
