తెలంగాణలో 178 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది. కరోనా, ఇతర కారణాలతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3,920 మందికి పాజిటివ్‌ రాగా, 148 మంది మరణించారు.1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని ఇండ్లకు వెళ్లారు. 2,030 మంది చికిత్స పొందుతున్నారు.