భారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో మొత్తం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 286579గా నిలిచింది.  దీంట్లో యాక్టివ్‌ కేసులు 137448గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.  వైరస్‌ సంక్రమించిన వారిలో 141029 మంది కోలుకున్నట్లు పేర్కొన్నది.  దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య 8102గా ఉన్నది.  

దేశవ్యాప్తంగా జరిగిన వైరస్‌ శ్యాంపిళ్ల పరీక్షలకు సంబంధించిన అప్డేట్‌ను ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 5213140 మందికి వైరస్‌ టెస్టింగ్‌ నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. గత 24 గంటల్లో దేశంలో 151808 మందికి పరీక్ష చేసినట్లు చెప్పింది.