ప్రభాస్ బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు: ఎంపీ సంతోష్ కుమార్

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశను ప్రభాస్  ప్రారంభించారు. ప్రభాస్ తన నివాసంలో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మూడు మొక్కలు నాటి మూడో దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు. 

 ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది మంచి మనసు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకమని అన్నారు. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతులమీదగా ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మూడవ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమని ప్రభాస్ అన్నారు. కోట్లాదిగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా “ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి” నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.  ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమన్వయకర్త సంజీవ్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.