రేపు ఇంటర్ పరీక్షల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మూల్యాంకనాన్ని పూర్తిచేసి శుక్రవారం ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నట్లు సమాచారం.