ఏపీలో 17 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు, ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్. బాలసుబ్రమణ్యం, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ ఏఐజీగా బి.ఉదయ్‌భాస్కర్‌ను నియమించింది.
విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు, రోడ్ సేఫ్టీ ఏడీజీగా కృపానంద్ త్రిపాఠి, ఎస్‌ఈబీ డైరెక్టర్ పి.హెచ్.డి.గా రామకృష్ణ, శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్, గుంటూర్ అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్. అమ్మిరెడ్డి తదితరులను బదిలీ చేసింది. ‘దిశ’ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.