తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం తెలంగాణలో కొత్తగా మరో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,737కు చేరింది. కరోనా ప్రభావంతో శనివారం రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 182 మంది చనిపోయారు.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, నల్లగొండ, ములుగు, సిరిసిల్ల, మంచిర్యా ల జిల్లాల్లో రెండు చొప్పున, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూలు, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,352 మంది డిశ్చార్జి కాగా, మరో 2,203 మంది చికిత్స పొందుతున్నారు.