ఏపీలో కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 253 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో ఇద్దరు కూడా కరోనా బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 84కు పెరిగింది.