‘ఎంఎస్‌ ధోనీ’ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌ సింగ్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుశాంత్‌ సింగ్‌ టీవీ సీరియళ్లతో కెరీర్‌ షురూ చేసి సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ కొనసాగిస్తున్న ఇలా ఆత్మహత్యకు పాల్పడటం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.