ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌ పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన ప్రతి చెక్‌పోస్టు వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.