ఆంధ్రప్రదేశ్ కోరోనా వైరస్ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 304 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6456కి చేరగా, మరణించిన వారి సంఖ్య 86కి పెరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 246 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 52 మంది, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిపారి.