ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా బడ్జెట్‌ను (2019–20) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉ.10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం సభ ఎజెండాను రూపొందించేందుకు బీఏసీ సమావేశం కానుంది. గత  ఏడాదిగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. ఆయా పథకాలను నిధులను మరిన్ని పెంచే విధంగా బడ్జెట్‌ను రూపకల్పన చేసింది. సంక్షేమ పథకాలను, నవరత్నాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగానికి కూడా  పెద్ద ఎత్తున చేయూతనిచ్చే విధంగా పద్దును తయారుచేసే అవకాశం ఉంది. ఇక సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఏపీ మంత్రివర్గం సమావేశం ఇ‍ప్పటికే ప్రారంభమైంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో మంత్రి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
  • గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం
  • 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి
  • 2020–2021 రాష్ట్రబడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌ 
  • 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 
  • ఆక్వాకల్చర్‌లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్‌ మరియు డెవలప్‌మెంట్‌కోసం చట్టం