కరీంనగర్ కమిషనరేట్‌ కేంద్రంలో హరితహారం

హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్‌ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభించే హరితహారంలో కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు 50 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీస్‌శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సిబ్బందికి పిలుపు నిచ్చారు. కాగా, 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, ఏసీపీలు శంకర్‌రాజు, మదన్‌లాల్‌, ఎస్‌బీఐ ఇంద్రాసేనారెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్‌ పాల్గొన్నారు.