ఏపీ బడ్జెట్‌ 2020-21కు శాసనసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2020-21ను శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు భారత్‌, చైనా ఘర్షణలో వీరమరణం పోందిన సైనికులకు సీఎం జగన్‌మెహన్‌రెడ్డితో పాటు శాసన సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అసెంబ్లీకి నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.