తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 269 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,675కు చేరింది. ఇందులో ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. 3,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో బుధవారం ఒకరు మృతి చెందా రు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 192కు చేరింది.