భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.   గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే భారత్‌లో  12,881 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24గంటల వ్యవధిలో మరో 334 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ భారత్‌లో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,66,946కు  చేరింది.

ప్రస్తుతం 160384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు 194325 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12237కు పెరిగింది.