ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 5గురు సభ్యులు పోటీ పడుతున్నారు.

అధికార వైఎస్సార్‌ పార్టీ తరుఫున పరిమళ్‌ నత్వాని, మోపిదేవి వెంకటరమణారావు ,ఆళ్ల అయోద్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీ పోటీ చేస్తుండగా,  తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175మంది  శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహిస్తున్న పోలింగ్‌  ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు  కొనసాగనున్నది. సాయంత్రం 5గంటలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.