పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజి రెడ్డి తనకున్న ఒక ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తహశీల్దార్, వీఆర్వోల పేర్లు సూసైడ్ నోట్ రాసి రాజారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
