సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, శాసన మండలి కార్యదర్శి వి. నరసింహాచార్చులును ఛాలెంజ్ చేయగా వారు దాన్ని స్వీకరించి శాసన సభ ప్రాంగణంలో నేడు మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆయన శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్, శాసన పరిషత్ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, అలంపూర్ శాసన సభ్యులు వి.ఎం అబ్రహంకు ఛాలెంజ్ చేశారు.
వీరందరూ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్, ఇందులో తనను భాగస్వామిని చేసిన వి.సి సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇలానే ముందుకు సాగితే రాష్ర్టంలో 33శాతం పచ్చదనం పెరిగి సీఎం కేసీఆర్ ఆకాక్షించిన హరిత తెలంగాణ, హరిత భారత్ లక్ష్యం అనతి కాలంలోనే సాధ్యమవుతుందన్నారు.