తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత సంపుటి ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం అందజేశారు. ఈ పురస్కరాన్ని మహబూబ్ నగర్ సాహిత్య సంస్థ వారు ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటికి ఇవ్వడం జరుగుతుంది. 2018 సంవత్సరానికి గాను డా. ఏనుగు నరసింహారెడ్డి రచించిన మూలమలుపు కవిత సంపుటికి బుధవారం మహాబూబ్ నగర్ లో జరిగిన సమావేశంలో అందజేశారు.ఈ సందర్భంగా డా.ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతు మూలమలుపు కవిత సంపూటికి పాలమూరు సాహితీ పురస్కరం రావడం ఆనందంగా ఉందన్నారు.