విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల యూఎస్‌ నుంచి వచ్చిన ఆయన రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది.

మూడోసారి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ‘తాను త్వరలో పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తా’నని  దీమాను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో  ఇప్పటివరకు 162 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తాసీల్‌ కార్యాలయాన్ని తాత్కలికంగా మూసివేశారు. కార్యాలయంలో   ఆ అధికారి ఎవరెవరినీ కలిశారు.. కార్యాలయానికి వచ్చిన ప్రజలెంత మంది తదితర వివరాలను సేకరించి వారందరినీ అప్రమత్తం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.