ఏపీలో కొత్తగా మరో 462 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 407 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 

ఇక గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. 8 మంది మరణించారు. కరోనాతో చనిపోయిన ఈ ఎనిమిది మంది కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందినవారుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 9834 మంది ఈ మహమ్మారి వైరస్‌ బారిన పడగా.. 4592 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 119 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 5123 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో తూర్పుగోదావరి(87), అనంతపురం(68) జిల్లాలలో అత్యధికంగా నమోదయ్యాయి.