తెలంగాణలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 652 రికార్డయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 112, రంగారెడ్డి 64, వరంగల్ రూరల్ 14, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్ 9, జనగామ 7, నాగర్‌కర్నూల్ 4, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 2 చొప్పున, మెదక్ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్ కారణంగా చికిత్సపొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,249 నిర్ధారణ పరీ క్షలు నిర్వహించగా, 9,553 పాజిటివ్‌గా తేలాయి. ఇప్పటివరకు 4,224 మంది డిశ్చార్జి అయి నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.
