ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,423 యాక్టివ్ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు.