ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘డొక్కా’ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్‌ పార్టీ తరుఫున  మాజీ మంత్రి డొక్కా వర ప్రసాద్‌ పేరును ఖరారు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వరప్రసాద్‌ ఎమ్మెల్సీగా  కొనసాగారు.

గత మార్చి 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను భారత ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ స్థానాన్ని ఆయనతోనే  భర్తీ చేస్తేందుకు గాను డొక్కా వరప్రసాద్‌ పేరును ఖరారు చేస్తు ముఖ్యమంత్రి జగన్‌  నిర్ణయం తీసుకున్నారు. గురువారం నామినేషన్‌ గడువు చివరి రోజు కావడంతో డొక్కా వరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

అసెంబ్లీలో వైఎస్సార్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉండడంతో డొక్కా ఎన్నిక లాంఛనం కానున్నది.