చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
